Andala Rakshasive Song Lyrics In Telugu – Oke Okkadu Movie
Movie Name: Oke Okkadu
Music Director: A.R Rahman
Lyrics Written by: AM Rathanm, Siva Ganesh
Singers: Hariharan, Mahalaxmi Iyyer
Cast: Arjun, Manisha Koirala
Andala Rakshasive Song Lyrics In Telugu
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
సూర్యున్ని రెండు చేసి కళ్ళలోన దాచుకుందో అహ ఓ
చందురున్ని కంటిపాపలోన తాను ఉంచుకుందో ఓ
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా అహ ఓ
మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా ఓ
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా
తలగడగా నాకొక్క పంచె నువ్వీయవయా కనులా కునుకే కలయా
చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా
తేనెపట్టు పట్టుపట్టి పాడు చేయ శపథమా అహ ఓ
ప్రేమంటే పార్టీ విడిచీ పార్టీ మార్చు విషయమా ఓ
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులౌదువా అహ ఓ
నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నేగనక నీరైతే నీ నుదుటపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా కానీ అన్నీ కలలే
చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా