Ye Shwasalo Song Lyrics In Telugu And English – Nenunnanu Movie (2004)
Movie Name: Nenunnanu
Lyrics written by: Siri Vennela
Music Director: MM Keeravani
Singer: Chitra
Ye Shwasalo Song Lyrics In Telugu
వేణుమాధవా ఆ….
వేణుమాధవా ఆ….
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై…
ఆ మోవిపై ..ఈ..నే మౌనమై…
నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ…
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా…
తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ…ఈ…
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ..
నలువైపుల నడిరాతిరి ఎదురవదా…
అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ..
అలజడితో అణువణువూ తడబడదా…
ఆ….ఆ….ఆ….ఆ….ఆ………..
నువ్వే నడుపు పాదమిది…
నువ్వే మీటు నాదమిది..
నివాళిగా నా మది..
నివేదించు నిమిషమిది…
వేణుమాధవా నీ సన్నిధీ…. ఈ..ఈ…
గగరిగరిసరి గగరిరి సరి
గపదసాస దపగరిసరి..
గగదపదా గపదసదా దాపాగరిగా..
దపదసస దపదసస
దపదరిరి దపదరిరి
దసరిగరిసరి
గరిసరి గ రి గరిసరిగా…
రి స ద ప గగగ పాప
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప గ రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా
రి గ ప ద రి గా…..
రాధికా హృదయ రాగాంజలీ….
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి …
ఈ గీతాంజలి….